ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు.
మంగళవారం తంజావూర్ పోలీసులు చెన్నై, నీలాంగరైలోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉదయనిధిని తంజావూర్ తరలిస్తున్నట్లు సమాచారం.
నిరసన సభలో కామెంట్లు..
సోమవారం తంజావూరులో జరిగిన కావేరి జలాల నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా 'త్రిష.. త్రిష' అని నినాదాలు చేశారు. దానికి ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ.. హీరోయిన్ త్రిష, సీఎం విజయ్‌లను ఉద్దేశించి అనుచితమైన డబుల్ మీనింగ్ కామెంట్లు చేశారు.
ఉదయనిధి స్టాలిన్ కామెంట్లపై టీవీకే పార్టీ మహిళా విభాగం తంజావూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తంజావూర్ పోలీసుల బృందం చెన్నై చేరుకుంది. మంగళవారం ఉదయం స్థానిక పోలీసుల సాయంతో చెన్నై, నీలాంగరైలోని నివాసం వద్ద తంజావూర్ పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేశారు.
>
సీఎంఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫోకస్.. డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలకు సన్నాహాలు

