Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ఫ్యాన్స్‌కు సీఎస్కే ప్రత్యేక సందేశం

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ఫ్యాన్స్‌కు సీఎస్కే ప్రత్యేక సందేశం

చెన్నై, మే10: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ(ఆదివారం) ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయనతో గవర్నర్ అర్లేకర్ ప్రయాణ స్వీకారం చేయించారు. విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రయాణ స్వీకారం చేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం అభిమానులకు కీలక విజ్ఞప్తి చేసింది.

'మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు ఏ రాజకీయ బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్స్‌ తీసుకురావద్దు. పూర్తి 'యెల్లో'తోనే ఆటను ఆస్వాదించండి' అని ఎక్స్ ఖాతాలో సీఎస్కే పేర్కొంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో చెన్నై ఆరో స్థానంలో ఉంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో సీఎస్కే ఉంది. లఖ్‌నవూ ఏడు ఓటములతో చిట్టచివరి స్థానంలో ఉంది.

ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేకున్నా... విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో తమ స్థానం మెరుగుపర్చుకోవాలని ఎల్ఎస్‌జీ పట్టుదలతో ఉంది. చెపాక్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. కాసేపటి క్రితమే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం, మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వైభవ్ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా!

గుజరాత్‌ జైత్రయాత్ర

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy