Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్, జులై 07: సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేంద్రం కేటాయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.

మంగళవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం కృషి ఫలించిందని అన్నారు. మరో 40 ఏళ్ల పాటు మైనింగ్‌కు అవకాశం ఉందని పేర్కొన్నారు. 340 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీతకు అవకాశం కలిగిందని చెప్పారు. తాడిచర్ల-2లో 434.14 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని వివరించారు.

ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. బ్లాక్‌లో జీ-9 గ్రేడ్ నాణ్యమైన బొగ్గు లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ బొగ్గు బ్లాక్ ద్వారా 3 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దీని ద్వారా భూపాలపల్లి ప్రాంత అభివృద్ధికి భారీ ఊతం లభించినట్లు అయిందని అన్నారు. దీంతో రైలు, రోడ్డు మౌలిక వసతుల అభివృద్ధికి దోహదం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

విద్యుత్, పారిశ్రామిక రంగాలకు దీర్ఘకాలిక బొగ్గు భద్రత ఉంటుందని చెప్పారు. సింగరేణి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ఇది బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర బొగ్గు బ్లాకులు కూడా సింగరేణికే ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

జీవిత సత్యం చెప్పిన తాతయ్య.. వీడియో వైరల్

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

For More TG News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy