జాతీయం-అంతర్జాతీయం
సీరం అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి

పుణే: పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంజరి పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న సీరం సంస్థకు చెందిన ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా భవన నిర్మాణ కార్మికులేననీ.. ఐదో అంతస్తులో వారి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మందిని ఘటనా స్థలం నుంచి బయటికి తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విటర్లో స్పందిస్తూ... ''పుణే సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించింది.
ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను...'' అని పేర్కొన్నారు. కాగా ఈ ఘటన వల్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని సీరం సీఈవో అదర్ పూనావాలా పేర్కొన్నారు.
related stories
-
జాతీయం-అంతర్జాతీయం ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకా.. ధరలు ఎంతంటే..!
-
జాతీయం-అంతర్జాతీయం కోవిడ్ వ్యాక్సిన్ ధరలను ప్రకటించిన కేంద్రం
-
తెలంగాణ తాజావార్తలు ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం