Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్నాప్‌చాట్‌ ద్వారా మాదకద్రవ్యాల అమ్మకాలు

స్నాప్‌చాట్‌ ద్వారా మాదకద్రవ్యాల అమ్మకాలు

  • ఒడిసా నుంచి హైదరాబాద్‌కు సరఫరా..

  • హ్యాష్‌ ఆయిల్‌ సీజ్‌.. డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్టు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్‌ ఆయిల్‌ తరలిస్తున్న డ్రగ్‌ పెడ్లర్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులతో కలిపి జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి 200 మిల్లీలీటర్ల హ్యాష్‌ ఆయిల్‌ స్వాఽధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర శ్రీనివాస్‌ కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గంజాయికి అలవాటు పడిన శ్రీనివాస్‌ తర్వాత తానే డ్రగ్స్‌ దందాలోకి దిగాడు. గతంలో మూడు గంజాయి సరఫరా కేసుల్లో పట్టుబడిన శ్రీనివాస్‌ తన పంథాను ఏ మాత్రం మార్చుకోకుండా ఈ సారి హ్యాష్‌ ఆయిల్‌ దందాలోకి దిగాడు.

జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన శ్రీనివా్‌సకు ఒడిశాలోని కోరాపుట్‌ ప్రాంతానికి చెందిన హరితో స్నాప్‌చాట్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. హరి నుంచి హ్యాష్‌ ఆయిల్‌ తీసుకుని వచ్చి ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు ఈగల్‌ అధికారులకు ఉప్పందంది. దీంతో ఈనెల 7న అవుటర్‌ రింగ్‌రోడ్డు వద్ద శ్రీనివా్‌సను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు, ఈగల్‌ బృందాలు కలిసి పట్టుకుని హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. హరి పరారీలో ఉన్నట్లు ఈగల్‌ ఫోర్స్‌ డైరక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy