ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర సమస్యలపై కాకుండా పార్టీ కోసం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళుతున్నారంటూ వైసీసీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కేంద్రానికి మొదటి లేఖగా సెర్బియా పోలీసులు చేతిలో చిక్కుకున్న.. సహ నిందితుడిని విడిపించమని ఉత్తరం రాశారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో తమ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ''ఏ నాడైనా కేంద్ర నిధుల కోసం, ప్రత్యేక హోదా కోసం కానీ.. పోలవరం కోసం కానీ ఇలా ప్రత్యేక విమానాల్లో వెళ్లారా? పంచాయితీల కోసం ప్రజాధనం వృధా చేయడం ఏంటి జగన్ గారూ'' అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు ఎంపీలు ఉన్న ఫొటోను జత చేశారు.

