
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై అధికార ఆమాద్మీ పార్టీ (ఆప్) అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఓ వర్గంపై ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజౌరీ గార్డెన్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు.. సిక్కుల్లో కీలక నేతగా పేరుంది. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్న ఓ ఫోటో ఆయన ఫేస్‌బుక్‌లో కనిపించడంతో తీవ్ర వివాదం రేగింది. అయితే తన కుమారుడు పొరపాటున దాన్ని షేర్ చేశాడంటూ ఆయన దాన్ని డిలీట్ చేశారు. దీనిపై ఆమాద్మీ పార్టీ స్పందిస్తూ... ''ఆమాద్మీ పార్టీ ఓ సెక్యులర్ పార్టీ. ఇందులో ఎలాంటి మత వివక్షకు చోటులేదు. సిక్కు మతస్తులు సైతం బాధపడే విధంగా ఆయన చేసి వ్యాఖ్యలు ఉన్నాయి.
ఓ వర్గాన్ని కించపర్చేలా మాట్లాడడం గురునానక్ దేవ్ బోధలకు కూడా విరుద్ధం...'' అని పేర్కొంది.