రియాధ్: సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నెలల్లోనే ఏకంగా 2.5 లక్షల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 2020 మూడో త్రైమాసికంలో 2,57,170 మంది విదేశీయులు జాబ్స్ కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే గతేడాది రెండో త్రైమాసికంలో 10.46 మిలియన్లుగా ఉన్న ప్రవాస కార్మికుల సంఖ్య 10.2 మిలియన్లకు పడిపోయింది. అదే సమయంలో సౌదీ పౌరుల ఉద్యోగాలు 82వేలు పెరగడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.25 మిలియన్లకు చేరింది. అయితే, 2020 మూడో త్రైమాసికంలో సౌదీ.. వీదేశీయులకు జారీ చేసిన కొత్త వర్క్ వీసాల సంఖ్య 23వేలు పెరగడం గమనార్హం. రెండో త్రైమాసికంలో 49,600 వర్క్ వీసాలు జారీ చేస్తే..
మూడో త్రైమాసికంలో ఏకంగా 72,400 వీసాలు జారీ చేసినట్లు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ నివేదిక పేర్కొంది.

