Dailyhunt
సౌతాఫ్రికా గెలవాలని కోరుకుంటున్న భారత్!

సౌతాఫ్రికా గెలవాలని కోరుకుంటున్న భారత్!

స్పోర్ట్స్ డెస్క్: టీ 20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లోఒక్క ఓటమి భారత్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ల్లో భారీ గెలుపుతో పాటు, ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మరో మ్యాచ్ ఫలితం కోసం టీమిండియా ఎదురు చూస్తుంది. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలని భారత్ కోరుకుంటుంది.

టీ20 ప్రపంచ కప్2026 'గ్రూప్‌-1'లోనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితం కూడా చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్‌ కోరుకోవాలి. తర్వాత జింబాబ్వే మ్యాచ్‌లో భారీ నెట్ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. అలానే వెస్టిండీస్ మ్యాచ్‌తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు రన్‌రేట్‌ లెక్కల అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ గెలిస్తే సరిపోతుంది.

కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్‌ గెలిస్తే మాత్రం... మనం మిగతా రెండూ గెలిచినా సెమీస్ బెర్తు గ్యారంటీ లేదు. మూడు జట్లూ రెండేసి విజయాలతో సమానమైతే నెట్ రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా, విండీస్‌లకు వెనక్కి నెట్టడం భారత్‌కు అంత సులువు కాదని క్రీడా నిపుణలు అంటున్నారు. మొత్తంగా జింబాబ్వేతో మ్యాచ్‌ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. అందుకే టీమిండియాతో పాటు అభిమానులు కూడా ప్రొటీస్ జట్టు గెలవాలి అని కోరుకుంటున్నారు.


మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

లంకను సాగనంపారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy