Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Special buses should be run to Bhogapuram. భోగాపురానికి ప్రత్యేక బస్సులు నడపాలి

Special buses should be run to Bhogapuram. భోగాపురానికి ప్రత్యేక బస్సులు నడపాలి

భోగాపురానికి ప్రత్యేక బస్సులు నడపాలి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించడం ఆనందదాయకం

పార్లమెంట్‌ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు

విజయనగరం రూరల్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి భోగాపురానికి ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడుపున్నట్లే..

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నడపాలని ప్రభుత్వాన్ని కోరుతూ టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ తీర్మానించింది. కమిటీ సమావేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక తీర్మానాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు.

ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు బస్సులు నడపాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అనంతరం కిమిడి నాగార్జున మాట్లాడుతూ 30 రోజుల క్రితం పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటికీ కూటమి కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలన్నారు. 50 శాతం పూర్తయిందని, మిగతా ప్రక్రియను అంతా వారంలో పూర్తిచేయాలని నిర్దేశించారు.

సమగ్ర ఓటరు సర్వే (సర్‌) ప్రక్రియకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలించి అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి తెలియజేయాలన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదుల ప్రసాద్‌, నాయకులు ఆకిరి ప్రసాద్‌రావు, కనకల మురళీమోహన్‌, కొర్నాన ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy