Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పిన్ ఉచ్చులో చిక్కకుండా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న శుభ్‌మన్ గిల్

స్పిన్ ఉచ్చులో చిక్కకుండా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న శుభ్‌మన్ గిల్

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో గిల్ రెండుసార్లు ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది.

ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో బంతి లైన్‌ను పూర్తిగా కవర్ చేయడంలో గిల్ ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ను లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఏకంగా 11 సార్లు ఔట్ చేశారు.

జడేజా, సుతార్‌తో సాధన

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్‌లో గిల్ ప్రత్యేకంగా లెఫ్టార్మ్ స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక బౌలర్ల బంతులను కూడా చాలాసేపు ఆడాడు. గిల్ సాధనపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునేందుకు గిల్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. 'అతని ఆటలో సహజంగానే పరుగుల ప్రవాహం ఉంటుంది. పిచ్ పరిస్థితులు, బంతి వేగం, ఎలాంటి షాట్లు ఆడాలి, ఎలా డిఫెన్స్ చేయాలనే విషయాలను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ తన సహజ ఆటతీరునే అనుసరిస్తాడు' అని బహుతులే వివరించారు. మరోవైపు ఆఫ్‌ స్పిన్నర్లు, లెగ్ స్పిన్నర్లపై గిల్ రికార్డు మెరుగ్గా ఉంది.

strong>

22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా టీమిండియా మాజీ క్రికెటర్

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy