Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థలం గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది.. ఉత్తరాఖండ్ సీఎంను ట్యాగ్ చేసి పంత్ ట్వీట్

స్థలం గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది.. ఉత్తరాఖండ్ సీఎంను ట్యాగ్ చేసి పంత్ ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: భారత బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధరాత్రి ఓ సంచలన ట్వీట్ చేశాడు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ..

తన సొంత రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కావాలని అడిగాడు. ఢిల్లీలో ఉన్న తన బేస్‌ను ఉత్తరాఖండ్‌కు మార్చాలని భావిస్తున్నట్లు తెలిపాడు. పంత్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శనివారం అర్ధరాత్రి 12.46 గంటలకు పంత్ ఈ విషయంపై ఎక్స్‌లో పోస్టు చేశాడు. 'హలో సర్. మూడేళ్లుగా సొంత రాష్ట్రంలో ఇల్లు కట్టుకునేందుకు ల్యాండ్ దొరకడం లేదు. ప్రభుత్వం ఇస్తానన్న భూమి కూడా రాలేదు. ఢిల్లీలో ఉన్న నా బేస్‌ను ఉత్తరాఖండ్‌కు మార్చుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా. స్థలం కొనుగోలు విషయంలో ప్రభుత్వం సహాయం చేయాలి' అని పంత్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. అయితే అంతటితో ఆగకుండా మరో పోస్టులో పంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు గుర్తింపుగా ప్రభుత్వం స్థలం గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమేనని.. ప్రభుత్వ నిర్ణయించిన ధరకు స్థలం ఇస్తే తన సొంత రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకుంటానని చెప్పాడు.

పంత్ చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. నిజంగానే పంత్ ఇలా పోస్ట్ చేశాడా? లేక అతడి ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురైందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2027 వేలానికి ముందు జూన్‌లో పంత్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా రూ.15 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

strong>

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy