Dailyhunt
సూపర్ సెంచరీ వెనుక మాస్టర్ మైండ్.. సీక్రెట్ బయటపెట్టిన హ్యారీ బ్రూక్

సూపర్ సెంచరీ వెనుక మాస్టర్ మైండ్.. సీక్రెట్ బయటపెట్టిన హ్యారీ బ్రూక్

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా నిన్న(బుధవారం) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పాకిస్థాన్ నిర్దేశించిన165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్ గెలుపు జెండా ఎగరేసింది. మ్యాచ్ అనంతరం తన మెరుపు ఇన్నింగ్స్ విజయ రహస్యాన్ని పంచుకున్నాడు. హ్యారీ బ్రూక్ తన సెంచరీని, ఇంగ్లండ్ విజయానికి సంబంధించిన సక్సెస్ క్రెడిట్‌ను కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్(బాజ్)కు ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం బ్రూక్ పలు విషయాలను షేర్ చేసుకున్నాడు.

సాధారణంగా బ్రూక్(Harry Brook) లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. తన బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై బ్రూక్ స్పందిస్తూ.. 'మేము సెమీస్‌కు చేరాలనే లక్ష్యంతో ఉన్నాం. పాకిస్థాన్‌ను ఓడించడంతో ఆ పనిని పూర్తి చేశాము. నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలనేది మా కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendan McCullum) మాస్టర్ మైండ్ వ్యూహమే. మ్యాచ్ జరిగే కొన్ని గంటల ముందు ఆయన నా దగ్గరకు వచ్చారు. పవర్‌ప్లేను మనం మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.. నీకు ఎలాగో ఎటాకింగ్ చేయడం అంటే ఇష్టం కదా అని ఆయన నాతో చెప్పారు. అదే ఈ మ్యాచ్‌లో ఉపయోగించమన్నారు. అదృష్టవశాత్తూ ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యింది' అని బ్రూక్ తెలిపాడు.

ఇక మ్యాచ్(England vs Pakistan) విషయానికి వస్తే.. నిన్న(ఫిబ్రవరి 24) పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 50 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ .. ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లండ్ చేతిలో ఓడిన పాక్.. ఆ విచిత్రం జరిగితే సెమీస్‌కు పక్కా..!

జూన్‌ 14న భారత్‌ X పాక్‌ పోరు
చిత్రం జరిగితే సెమీస్‌కు పక్కా..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy