Dailyhunt
సూర్య అభిమానుల సందడి

సూర్య అభిమానుల సందడి

తమిళ సినీ హీరో సూర్య అభిమానులు ఆయన పుట్టినరోజుకు ముందే సామాజిక ప్రసార మాధ్యమాల్లో సందడి చేశారు. సినీ రంగానికి చెందిన 115మంది ప్రముఖులతో సూర్య బర్త్‌డే పోస్టర్లను విడుదల చేయించి ప్రపంచ వ్యాప్తంగా తమ హీరో పుట్టిన రోజు తేదీని వెల్లడించారు. నటుడు సూర్య పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 23న జరుగనున్నాయి. ఆ సందర్భంగా తమ హీరో బర్త్‌డేను ప్రపంచ వ్యాప్తంగా ఎలుగెత్తి చాటేందుకు సినీ ప్రముఖుల చేత బర్త్‌డే గ్రీటింగ్‌ పోస్టర్లను సామాజిక ప్రసార మాధ్యమాల్లో విడుదల చేయించారు. కళైపులి ఎస్‌ థాను, డి.ఇమాన్‌, వివేక్‌, జ్ఞానవేల్‌, కార్తీక్‌, సిమ్రాన్‌, ఆర్యా, అతిథి రావు, లక్ష్మీ మంచు, ఆనంద్‌ దేవరకొండ, శిబిరాజ్‌, తమన్నా, విజయ్‌ మిల్టన్‌, మాధవన్‌, కార్తీ, ధనంజయన్‌, గౌతమ్‌ మీనన్‌ తదితరులు 115 మంది విడుదల చేసిన ఆ బర్త్‌డే పోస్టర్లను ఇప్పటివరకూ 70 లక్షలమంది వీక్షించినట్టు సూర్య అభిమాన సంఘం నిర్వాహకులు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy