Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్యకుమార్‌ నిర్ణయమే ముంబై ఇండియన్స్ కొంపముంచిందా?

సూర్యకుమార్‌ నిర్ణయమే ముంబై ఇండియన్స్ కొంపముంచిందా?

స్పోర్ట్స్ డెస్క్: ఫ్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై పోరాడి ఓడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై రెండు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.

ఈ ఓటమితో ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ ముంబై అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 167 పరుగుల ఫైటింగ్‌ టార్గెట్‌ను నిర్ధేశించిన ముంబై.. అందుకు తగ్గట్టుగానే అద్భుతంగా పోరాడింది. చివర్లో ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ ఘోర తప్పిదం చేశాడు.

జస్ప్రీత్ బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆర్సీబీకి చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సూర్య తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఘజన్‌ఫర్‌ రూపంలో నాణ్యమైన స్పిన్‌ బౌలర్‌ ఉన్నా, పెద్దగా అనుభవం లేని రాజ్‌ బవా చేతికి బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. చివరి ఓవర్‌లో చివరి బంతి వరకు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ.. బవా ఘోర తప్పిదాలు చేసి ఓటమికి కారణమయ్యాడు. 20వ ఓవర్లో బవా ఒత్తిడికిలోనై 3 వైడ్లు, ఓ నో బాల్‌ సహా 11 బంతులు వేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో కూడా బవా పెద్ద తప్పు చేశాడు.

చివరి బంతిని ఎదుర్కొన్న సలామ్‌ దార్‌ స్ట్రైట్‌గా ఆడగా.. బవా బంతిని ఆపలేకపోయాడు. దీంతో రసిక్‌ రెండు పరుగులు పూర్తి చేసి ఆర్సీబీని గెలిపించాడు. మ్యాచ్‌ అనంతరం సూర్య తీసుకున్న తప్పుడు నిర్ణయానికి విమర్శలపాలయ్యాడు. మెరుగైన బౌలర్లు ఉన్నప్పటికీ.. అప్పటికే 2 ఓవర్లలో 24 పరుగులిచ్చిన బవా చేతికి బంతినిచ్చి ఓటమిని కొని తెచ్చుకున్నాడని క్రీడా నిపుణులు అంటున్నారు. వరుసగా మరో సీజన్‌ ప్లే ఆఫ్స్‌కు ముంబై చేరలేకపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత తమకేదీ కలిసిరావట్లేదని వాపోతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy