Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్

నంతపురం, జూన్ 26: జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్షకు వైసీపీ నేతలు సిద్ధమవగా..

అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ కేతిరెడ్డి.. తన అనుచరులతో కలిసి భగత్‌సింగ్ నగర్‌లోని నివాసం ఎదుట బైఠాయించారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో పెద్దారెడ్డి ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి.. భగత్‌సింగ్ నగర్‌లోని కేతిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.


అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

Read Latest AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy