అనంతపురం జిల్లా: రక్తదాన దినోత్సవం సందర్భంగా సోమవారం తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేయడానికి యువకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రక్తదానం చేసేవారికి ముందస్తుగానే కరోనా పరీక్షలు చేయించి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
బ్లడ్ కొరత ఉందని, రక్తం దొరక్కా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక వైపు కరోనా మహమ్మరీతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతుంటే మరో వైపు రక్తం సకాలంలో దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

