Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాలిబన్లతో చర్చలు జరపండి: ఫరూక్ అబ్దుల్లా

తాలిబన్లతో చర్చలు జరపండి: ఫరూక్ అబ్దుల్లా

న్యూఢిల్లీ: తాలిబన్లతో చర్చలకు చొరవ తీసుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కేంద్రాన్ని కోరారు. అప్ఘనిస్థాన్‌లో ఇండియా బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టిందని, పెట్టుబడులు కాపాడుకునేందుకు అప్ఘన్ కొత్త పాలకులతో చర్చలు జరపడంలో కీడు ఏమీ లేదని ఆయన అన్నారు.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

శనివారంనాడిక్కడ మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ... ''అప్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం తాలిబన్లు అధికారంలో ఉన్నారు. గత పాలకుల హయాంలో వివిధ ప్రాజెక్టుల్లో ఇండియా బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత పాలకులతో మనం చర్చలు జరపాలి. ఒక దేశంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ దేశంతో చర్చించడం, సంబంధాలు కొనసాగించడంలో వచ్చే నష్టం ఏముంది?'' అని ప్రశ్నించారు.

ప్రధాని యూఎస్ పర్యటనపై..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో జరుపుతున్న పర్యటనపై ఆయన మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా అందరు నేతలతో మోదీ తప్పనిసరిగా మాట్లాడతారనే విషయం తాను చెప్పగలనని, ఉగ్రవాదం యావత్ ప్రపంచాన్ని మింగేస్తోందనే విషయంలో అనుమానాలకు తావే లేదని అన్నారు. అయితే ఉగ్రవాదాన్ని ఎవరు ప్రారంభించారు? ఇరాక్‌తో అటాచ్ అయిన వాళ్లెవరు? యూఎన్ హెచ్చరికలు చేసినప్పటికీ లిబియాపై బాంబులు వేసిందెవరు? ఇతర దేశాలను అస్థిరపరుస్తున్న ఉగ్రవాద దేశం ఏది?'' అని ఫరూక్ ప్రశ్నించారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని గుర్తించి, అన్ని దేశాలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ఏ దేశం బలహీనం కాకుండా శక్తివంతమైన దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. అలాగే, రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, రైతుల నుంచి సమాచారం తీసుకుని వ్యవసాయ రంగం కోసం నూతన చట్టాలను రూపొందించాలని కూడా ఫరూక్ అబ్దుల్లా సూచించారు.

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కాదు: సుప్రీం  కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy