Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లిపాలు బిడ్డకు సంజీవిని

తల్లిపాలు బిడ్డకు సంజీవిని

ప్రతి బిడ్డకు తల్లిపాలు సంజీవినితో సమానమని ఐసీడీఎస్‌ సిబ్బంది తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా ర్యాలీలు, అవగా హన కార్యక్రమాలు నిర్వహించారు.

ఫ కొమరాడ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని ఐసీడీఎస్‌ సీడీపీవో జి.సుగుణకుమారి తెలిపారు. కొమరాడ పీహెచ్‌సీతోపాటు పలు గ్రామాల్లో తల్లిపాలవారోత్సవాల్లో భాగంగా అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వ హించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు శారదాంబ, బంగారమ్మ, సెక్టార్‌ యూనియన్‌ నాయకులు అలివేలు, కార్యకర్తలు దేవి, శకుంతల, నాగమ్మ పాల్గొన్నారు.

ఫగరుగుబిల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఆరు నెలలు పూర్తయ్యే వరకు బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలని, తల్లిపాలు బిడ్డకు ఆరోగ్య రక్షణ కల్పిస్తాయని కొమరాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని గరుగుబిల్లి సెక్షార్‌ సూపర్‌వైజర్‌ రౌతు లక్ష్మి తెలిపారు. మండ లంలోని రావుపల్లి అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులతో కొమరాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి ఆదేశాల మేరకు తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు మర్రాపు సావిత్రి, చింతల అరుణకుమారి, జి.సంగమ్మ, పి.మంగ పాల్గొన్నారు.

ఫసీతంపేట,ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్‌ సీడీపీవో సిమ్మాలమ్మ తెలిపారు. శంభాం, కుసిమి సెక్టార్‌ పరిధిలో ఉన్న జమ్మడుగూడ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వ హించారు. కార్యక్రమంల ఏసీడీపీవో ఎల్‌.శాంతికుమారి పాల్గొన్నారు,

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy