Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తంబళ్లపల్లెలో టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌

తంబళ్లపల్లెలో టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌

తంబళ్లపల్లె, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లెలో ఫైలెట్‌ ప్రాజెక్టుగా టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు వెల్లడించారు.

గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపీఎం గంగాధర్‌తో కలసి ఎఫ్‌పీవో సభ్యులతో సమావేశం నిర్వహించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఆయన మాట్లాడుతూ నిలకడలేని ధరలతో టమోటా రైతులు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేలా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్‌లో టమోటా సాస్‌తో పాటు పలు ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని వివరించారు.

ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ యూనిట్‌ విజయవంతమయ్యేలా ఎఫ్‌పీవో సభ్యులతో పాటు వెలుగు మహిళా సంఘాలు చొరవ చూపాలని కోరారు. అనంతరం యూనిట్‌ ఏర్పాటుకు గాను ఎఫ్‌పీవో గోదామును సందర్శించారు. డీపీఎం నాగార్జున, రీసోర్స్‌పర్సన్‌ శ్రీనివాసులు, మండల సమాఖ్య అధ్యక్షురాలు రామలక్ష్మి, ఎఫ్‌పీవో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy