Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు విల్సన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంక్షేమం, విద్య, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని కొనసాగించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 'మేనమామ బంగారు కానుక' పథకం అమలుకు రూ.560 కోట్లు కేటాయించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల వృద్ధి, మరమ్మతుల కోసం రూ.125 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఆధునిక నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జెన్‌జీ విద్యార్థుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో విద్య, సంక్షేమం, యువత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy