
శ్రీకాకుళం జిల్లా: పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారని తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ అన్నారు. తాను తప్పు చేసినట్టు పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఒత్తిళ్లతోనే తనపై కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడనన్నారు. తమ్మినేనికి ఆమదాలవలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తానని కూన రవికుమార్ హెచ్చరించారు.
కాగా కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరయింది. రాజాం సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం కూన రవికి బెయిల్ మంజూరు చేసింది. పెనుబర్తిలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన కొట్లాటలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన గురువారం ఉదయం పొందూరు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యారు.