Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

మరావతి, మే 20: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు.

ప్రజల కోసమే జీవించిన మహనీయుడు టంగుటూరి అని కొనియాడారు. ఆయన.. ధైర్యసాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని సోషల్ మీడియా ఎక్స్‌లో చంద్రబాబు, లోకేశ్ పోస్ట్ చేశారు.

చంద్రబాబు ట్వీట్..

'తెలుగువారి ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడు ఆయన. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత నాయకుడి సేవలను స్మరించుకుందాం' అంటూ సీఎం పోస్ట్ చేశారు.

టంగుటూరి సేవలు మరువలేనివి: లోకేశ్

'ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాను. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులు. ఆయన.. ధైర్యసాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శాలను సాకారం చేయడానికి మనమందరం పునరంకితం అవుదాం' అంటూ లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy