Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తవ్వారు.. వదిలేశారు!

తవ్వారు.. వదిలేశారు!

తిప్పారెడ్డిపల్లె వద్ద సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో వాహనదారుల నరకయాతన

రుద్రవరం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పారెడ్డిపల్లె గ్రామం వద్ద కల్వర్టు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో గుంతలు తవ్వారు.

అయితే వాహనాల రాకపోకల కోసం సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఓ లారీ ఇరుక్కుని గుంతలో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇక వర్షాలు పడితే వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సర్వీస్‌ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

కాగా ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ, వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వీసురోడ్డు నిర్మించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy