
ఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి తీరుపై నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలకపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం జగన్‌పై ఆయనకు మక్కువ ఉన్నట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీకి తెలకపల్లి రవి అభిమానిగా మారిపోయినట్లు తెలుస్తుందన్నారు. అమరావతి రైతులు చనిపోతే మీ హృదయం ఏమైందని నిలదీశారు. అన్ని విషయాల్లో కరెక్ట్‌గా స్పందిస్తే బాగుంటుందని తెలకపల్లి రవికి రఘురామకృష్ణరావు హితవు పలికారు.