Dailyhunt
తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం

తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం

హైదరాబాద్: తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం రేగింది. పార్టీ నాయకత్వం తీరును అరుణ అనే మహిళా నేత ప్రశ్నించారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు కాకుండా ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి, నలుగురికి పదవులు ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు వచ్చిన వాళ్లు సంతోషంగా మాట్లాడుతున్నారని, ఉద్యమంలో పడిన తమ ఇబ్బందులు ఎవరికి తెలుసన్నారు. 20 ఏళ్ల నుంచి ఓపిక పడుతున్నామని, అడ్డమైన వాళ్లను తీసుకువచ్చి పదవులిస్తే తామంతా ఏం చేయాలని ప్రశ్నించారు. అరుణ చేతిలో మైక్ లాక్కుని ఆమెను మహిళా నేతలు బలవంతంగా కూర్చోపెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy