హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Telangana
Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) భారత్ ఫ్యూచర్ సిటీలో మంత్రి పర్యటించారు. ఈ సమ్మిట్ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాన వేదిక, ఎక్స్ పో జోన్, సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, కనెక్టివిటీ, అతిథులకు వసతులు, తదితర అంశాలపై ప్రత్యేకంగా మంత్రి సమీక్షించారు. సదస్సు గడువు సమీపిస్తున్నందున పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు ఆయా పనులను పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
And

