Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ తెగువకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: కేసీఆర్

తెలంగాణ తెగువకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): చాకలి ఐలమ్మ (Chakali Ailamma) 131వ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నివాళులు అర్పించారు.

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం.. రాష్ట్ర తెగువకు ఆమె నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తేనే ఆమెకు నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతామని పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. నాటి రాచరిక పాలనలో, రాష్ట్ర రైతాంగ న్యాయమైన హక్కుల కోసం, ధిక్కార స్వరం వినిపించిన ధీర వనిత అని ప్రశంసించారు. అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ అని కొనియాడారు.

ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శనీయం..

నాటి భూస్వాములను ఎదిరించి ధిక్కార స్ఫూర్తిని.. నాటి చట్టాల పరిధిలో న్యాయస్థానంలోనూ పోరాడి గెలిచి ప్రజాస్వామిక నిబద్ధతను ప్రదర్శించిన ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమని కేసీఆర్ ప్రశంసించారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న, అస్తవ్యస్త పాలనా రాజకీయ పరిస్థితుల్లో ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి, ప్రదర్శించిన రాష్ట్ర తెగువ నేటి యువతకు అనుసరణీయమని పేర్కొన్నారు. శాంతియుత పంథాలో తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఐలమ్మ అందించిన పోరాటం ఇమిడి ఉందని తెలిపారు. చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటేలా.. బీఆర్ఎస్ హయాంలో ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని తీసుకువచ్చామని అన్నారు.

మా హయాంలో వినూత్న పథకాలను అమలు చేశాం..

ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా.. నాటి పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో, మహిళలు, శిశు సంక్షేమం, రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక వినూత్న పథకాలను అమలు చేశామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేస్తూ, కుల వృత్తులను పునరుజ్జీవింప చేసి, సబ్బండ కులాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని మహోన్నతంగా నిలబెట్టామని గుర్తు చేశారు. తమ హయాంలో సాధించిన ఫలితాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ ఉద్ఘాటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy