
హైదరాబాద్: డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థుల కోసం ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ పెట్టాలని తెలంగాణ రిపబ్లికన్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ పిల్‌పై కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఉన్నత విద్యామండలి లేఖ రాసి 10 రోజులైనా నిర్ణయం తీసుకోలేరా అని విద్యాశాఖపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. లేఖపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. 2 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే విద్యాశాఖ ప్రత్యేక సీఎస్‌కు జరిమానా విధిస్తామని తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది.