హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యుత్‌శాఖలో పనిచేసే ఉద్యోగులు,కార్మికులకు కరోనా నుంచి రక్షణ కోసం స్సెషల్ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. నగరంలోని విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్‌లో టీఎస్ జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో సీఎండి ప్రభాకరరావు ఈ క్యాంపును ప్రారంభించారు. స్సెషల్ వ్యాక్సినేషన్ క్యాంప్‌లో విద్యుత్ ఉద్యోగులు, ప్రత్యేకించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పనిచేసేవారు, కార్మికులకు కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఈసందర్భంగా విద్యుత్ కార్మికుల సంక్షేమాన్నిదృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహిస్తోందని అన్నారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా 24గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా ఉద్యోగులుపనిచేస్తుంటారని అన్నారు. ఈ స్పెషల్‌క్యాంపు ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సహకారం ఎంతో ఉందని ప్రభాకరరావు పేర్కొన్నారు. మొదటి రెండు రోజులు ఓఅండ్ ఎం సిబ్బంది, కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరు ఉద్యోగులు, ఇంజనీర్లు, సద్వినియోగం చేసుకోవాలని సీఎండి ప్రభాకరరావుసూచించారు.

