హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భూముల అక్రమాలు, అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.
ఈ మేరకు జీవో నంబర్ -134ను ప్రభుత్వం జారీ చేసింది. వివిధ జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలపై విచారణ కమిటీని నియమించింది.
చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలపై ఈ కమిటీ ఆరా తీయనుంది. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చి తగిన చర్యలకు సిఫార్సులు చేయనుంది. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఏ. శ్రీదేవసేన ఐఏఎస్ ఉన్నారు. కన్వీనర్‌గా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంతు ఐఏఎస్, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐఏఎస్‌తో పాటు సంబంధిత జిల్లాల కలెక్టర్లను కూడా కమిటీ సభ్యులుగా నియమించింది.
ఈ భూములపై విచారణ చేయనున్న కమిటీ..
కేసీఆర్ కుటుంబం, కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన భూములపై ఈ కమిటీ విచారణ చేయనుంది.
ఎర్రవల్లి, సిరివెంకటాపూర్ భూములపై..
మాజీ మంత్రి హరీశ్‌రావు కుటుంబం, అనుచరులకు చెందిన రామంచ భూములపై..
రంగనాయకసాగర్ సమీపంలోని భూములపై..
మల్లన్నసాగర్ భూసేకరణలో అక్రమాల ఆరోపణలపై..
జన్వాడలో కేటీఆర్ కుటుంబ సభ్యులు, అనుచరులు కొనుగోలు చేసిన భూములపై..
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరుల భూములపై..
అజీజ్‌నగర్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు భూములపై..
అసైన్డ్ భూముల కొనుగోలు, ఆక్రమణలపైనా విచారణ
మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు సంబంధించిన ప్రభుత్వ భూముల వ్యవహారంపై..
వట్టినాగులపల్లిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి భూములపై..
శంకరాహిల్స్ భూముల కొనుగోలు వ్యవహారంపై..
జీరా భూముల్లో ఎల్విన్ స్టీఫెన్‌సన్ లీజ్ భూముల రెగ్యులరైజేషన్‌పై..
భూదాన్ భూముల కొనుగోలు వ్యవహారాలపై..
ధరణి మాడ్యూల్ దుర్వినియోగంపై..
మహబూబ్‌నగర్ జిల్లా గుండేడ్‌లోని పలు సంస్థల వ్యవహారాలపై ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్, ప్రభుత్వ భూముల కేటాయింపులపై..
మిడ్ మానేర్ రిజర్వాయర్ పరిహారం, R&R ప్యాకేజీల వ్యవహారంపైనా ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ చేయనుంది.
అవసరమైన రికార్డులు, పత్రాలు, డేటాను కోరే అధికారం ఈ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ విచారణ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి కమిటీ సమర్పించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..

