హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పనిచేయడం తనకు సంతృప్తినిచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)
పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో చాలా విషయాలను నేర్చుకున్నానని పేర్కొన్నారు.
తనకు సహకరించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సోనియా గాంధీ త్యాగం, కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
And

