
హైదరాబాద్: తెలంగాణలో శనివారం ఒక్కరోజే 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 68 కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారించారు. పాతబస్తీలో ఒకే కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలే కుటుంబ పెద్ద ఢిల్లీ వెళ్లి వచ్చాడు. ఇంటి యజమాని ద్వారా కుటుంబసభ్యులకు కరోనా సోకిందని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం శుక్రవారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం నమోదైన 14 కేసుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ రోజు 10 కేసులని వెల్లడించారు. ఆ తర్వాత మరో 4 పెరిగాయి. ఇంతకు ముందు కేసీఆర్ మీడియా సమావేశాల్లో కేసుల వివరాలు చెప్పినప్పటికీ, వైద్య ఆరోగ్యశాఖ మీడియా బులెటెన్ విడుదల చేసేది.
కానీ శుక్రవారం అలా చేయకపోవడం గమనార్హం.