హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను బుధవారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2012 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 70,958కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 576కి చేరుకుంది. నిన్న కరోనా నుంచి 1139 మంది కోలుకోగా.. మొత్తం ఇప్పటి వరకూ 50,814 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 12,938 యాక్టివ్ కేసులున్నాయి.

