Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెలిగ్రామ్‌పై నిషేధం.. కేంద్రంపై రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విమర్శలు..

టెలిగ్రామ్‌పై నిషేధం.. కేంద్రంపై రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విమర్శలు..

ఇంటర్నెట్ డెస్క్: నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. 'ఈ చర్య నిజంగా పేపర్ లీక్‌లను నిరోధిస్తుందా' అని వారు సందేహాలు వ్యక్తం చేశారు. పరీక్షా పేపర్ లీక్‌లను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు (Telegram ban).

'పేపర్ లీక్ మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, టెలిగ్రామ్‌ను నిషేధించారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. దొంగలను పట్టుకోలేక, బాధితుల తలుపులకు తాళం వేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని నోట్స్, టెస్ట్ సిరీస్‌లు, డిస్కషన్‌లతో చదువుకుంటున్నారు. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్ లీక్‌లకు పరిష్కారం ఎలా అవుతుంది' అని సోషల్ మీడియా ద్వారా రాహుల్ (Rahul Gandhi) విమర్శించారు.

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా ఈ అంశంపై స్పందించారు. 'ఈ రోజు టెలిగ్రామ్‌ను నిషేధించారు. రేపు వాట్సాప్‌ను కూడా నిషేధిస్తారా?' అంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు. మరోవైపు ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ కూడా ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఇది 15 కోట్లకు పైగా భారతీయ వినియోగదారులను శిక్షించడమే. ఈ చర్య అసలు లీక్‌లను ఆపదు' అని వ్యాఖ్యానించారు.


మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు..

సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy