Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్

హైదరాబాద్: ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్‌లో అధ్యక్షుడుగా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్‌లో మొత్తం 72 ఓట్లు ఉండగా.. వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్‌కు 42, కొమర వెంకటేష్‌కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ గెలుపొందారు. కోశాధికారిగా పోటీ చేసిన రాజేశ్వర్ రెడ్డికి కూడా 42 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శిగా పీఎస్ ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. ''దర్శకరత్న దాసరిగారు ఫిలిం ఫెడరేషన్‌ను ఏ ఆశయాలతో కొనసాగించారో, అవే ఆశయాలతో మేము సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తాం.

సినీ కార్మిక ఐక్యత కోసమే మేమంతా పోరాటం చేసి గెలిచాం. కరోనా వల్ల చిత్ర పరిశ్రమలో కార్మికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వారిని ఆదుకోవడంపై మొట్టమొదటగా దృష్టి పెడతాం. ఇండస్ట్రీలోని పెద్దల్ని అలాగే ఛాంబర్, నిర్మాతల మండలి సహకారంతో ఈ కష్టకాలంలో కార్మికులను బతికించుకుంటాం. కార్మికుల వేతనాలు విషయంలో చర్చలు సాగిస్తాం. కార్మికులు ఐక్యతగా ఉంటే పరిశ్రమ బాగుంటుంది. మా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నారు.

ఇవాళ కార్మికులు వాళ్ల కోసం పనిచేసే, వాళ్ల కోసం ఆలోచించే టీమ్‌ను ఎన్నుకున్నారని, దేశవ్యాప్తంగా సినీ కార్మిక సంఘాలకు పేరు తెచ్చిన వారు ఈ ఎన్నికల్లో గెలవడం శుభపరిణామం అన్నారు 'మనం సైతం' కాదంబరి కిరణ్. నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎన్నుకున్న వారికి ధన్యవాదాలు తెలిపారు పీఎస్ఎన్ దొర, రాజేశ్వర్ రెడ్డి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy