ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ కుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి..
శ్రేయస్ అయ్యర్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అందించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ జట్టులోనూ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో చోటు దక్కింది. మొదట జూన్ 26, 28 తేదీల్లో భారత్.. ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో 5 టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. కాగా సెప్టెంబర్‌లో జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనుంది.
ఆసియా క్రీడలు 2026: భారత జట్టు ఇదే
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివం దూబె, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టు
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివం దూబె, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్

