Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

స్పోర్ట్స్ డెస్క్: మహిళల క్రికెట్‌లో భారత యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న ఆమె..

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

టీ20 ప్రపంచ కప్ 2026లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనే 10 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది శ్రీచరణి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ ఓడినప్పటికీ.. చరణి (3/24) అద్భుత బౌలింగ్‌తో మెరిసింది. ఈ ప్రదర్శనతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి(753 పాయింట్లు) ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ ప్రపంచకప్‌ 2026 టోర్నీలో శ్రీ చరణి ప్రదర్శన భారత జట్టుకు ప్రధాన బలంగా మారింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే నెదర్లాండ్స్‌పై 4/19తో చెలరేగిన ఆమె, అంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 3/21తో సత్తా చాటింది. ఈ టోర్నీలో తాజా ప్రదర్శనతో ప్రపంచకప్‌2020లో భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ నెలకొల్పిన అత్యధిక వికెట్ల (10) రికార్డును చరణి సమం చేసింది. గ్రూప్ దశలో ఇంకా రెండు మ్యాచులు ఉండటంతో శ్రీచరణి త్వరలో పూనమ్‌ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ 733 పాయింట్లతో రెండో స్థానానికి చేరగా, లిన్సే స్మిత్(726) మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు భారత సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ(708) మూడు స్థానాలు కోల్పోయి.. ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్(722) నాలుగు స్థానాలు ఎగబాకి నాల్గో ర్యాంకుకు చేరుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ 513 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చమరి ఆటపట్టు(365) దీప్తిని(364) వెనక్కి నెట్టి ముందంజ వేసింది. భారత్‌పై అజేయ హాఫ్ సెంచరీ (81*), రెండు వికెట్లతో మెరిసిన దక్షిణాఫ్రికా వెటరన్ మరిజానే కాప్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 9వ ర్యాంకుకు చేరుకుంది.

క్రిస్ గేల్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పొలార్డ్.. ఎందుకంటే..

భారత జట్టులోకి పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy