హైదరాబాద్: టీఆర్ఎస్ వేగంగా పతనం అవుతోందని ప్రస్తుత టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2018 ఎన్నికలలో బీజేపీకి 105 నియోజక వర్గాలలో కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. బీజేపీ ఒక నీటి బుడగలాంటిదని, కాంగ్రెస్‌కు ప్రతి గ్రామంలో, ప్రతి మునిసిపాలిటీలో కార్యకర్తల బలం ఉందన్నారు. కాంగ్రెస్‌కు అనుబంధ సంఘాలు ఒక అసెట్ అని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. కొంత మంది స్వార్థపరులు, పార్టీలో అన్ని అనుభవించి ఇప్పుడు పార్టీని తిడ్తున్నారని మండిపడ్డారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ, టిఆర్ఎస్‌లు అమలు చేయలేకపోయాయని ఉత్తమ్ విమర్శించారు.

