Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి

టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి

గుర్రంబోడుతండా బాధితులకు అండగా ఉంటా: ఉత్తమ్‌

మఠంపల్లి, సెప్టెంబరు 23: అమాయక గిరిజనుల భూములు లాక్కొని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు, వారికి కొమ్ముకాస్తున్న అధికారులకు రోజులు దగ్గర పడ్డాయని నల్లగొం డ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో గురువారం గాయపడిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ అఽధికార పార్టీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తరిమికొడతారని, అందుకు ఎంతో సమయం లేదన్నారు. 540 సర్వేనంబర్‌లో గిరిజనుల భూమిని ఎమ్మెల్యే సైదిరెడ్డి 100ఎకరాలు, స్థానిక ఎంపీపీ 100 ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు.

గిరిజనులపై దాడులు జరిగి పది రోజులు గడిచినా ఇంకా కేసులు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పది రోజుల్లో సమస్య పరిష్కారం కాకుండా గిరిజనులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామన్నారు. సైదిరెడ్డి ఎన్నికైన తర్వాతే దాడులు, భూకబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దౌర్జన్యకాండపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఐ సీఐ, డీఎస్పీలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy