కాకినాడ: జగన్ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందని, కరువు ప్రాంతమైన అనంతపురం లోనూ వర్షాలు కరుస్తున్నాయని మంత్రి కన్నబాబు తెలిపారు. గత ఏడాది వరద అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురయ్యేలా టీడీపీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అప్రకటిత అధ్యక్షుడుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 3 లక్షలు ఉద్యోగాలు తొలగిచామని మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారని, ఎవరిని తొలగించామో చూపించాలని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని కన్నబాబు తెలిపారు.

