హైదరాబాద్: తెలంగాణ గురుకుల(టీఎస్‌ఆర్‌జెసి) జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంగ్లీస్‌మీడియం- ఎంపిసి/బిపిసి/ఎంఈసీ)లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుచేస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశ కొరకు జరిగే టీఎస్‌ఆర్‌జెసి-సెట్-2020 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి చివరి తేదీ 5-08-2020 నుంచి 20-08-2020 వరకు ప్రభుత్వం పొడిగించింది.
