Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ నుంచి పిలుపు!

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ నుంచి పిలుపు!

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ ఉండనున్నాడు. గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మను నియమించనున్నట్లు సమాచారం.

నివేదికల ప్రకారం..శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అధికారిక ఆమోదం లభించే అవకాశముంది. శనివారం జరిగే బీసీసీఐ సెలక్షన్ సమావేశానికి అయ్యర్ హాజరవుతాడు. మరోవైపు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలని సూచించినట్లు సమాచారం. అయితే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని సమాచారం. అయితే తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడంపై అజిత్ అగార్కర్, గంభీర్, సెలక్షన్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చారు.

సూర్యకుమార్ సారథ్యంలో భారత జట్టు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, బ్యాటింగ్‌లో సూర్యకుమార్ ప్రదర్శన ఆకట్టుకోలేదు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేశాడు. అలానే ఐపీఎల్2026లో కూడా, అతను ముంబై ఇండియన్స్ తరఫున 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇది పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలవడానికి ప్రధాన కారణమైంది. 'ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే, సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్న టీమిండియా జట్టులో సూర్యకుమార్ భాగం కాకపోవచ్చు' అని భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీం ఒక ప్రత్యేక సంభాషణలో తెలిపాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy