Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

తిరుమల, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు (సోమవారం) అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శ్రీవారి సర్వ సేనాధిపతి విశ్వక్సేనులవారు పర్యవేక్షించనున్నారు.

రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. రేపు (మంగళవారం) సాయంత్రం 6:21 నుంచి 6:35 నిమిషాల వరకు మీన లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహాణం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.

రాత్రి 7.30 గంటలకు ఏపీ ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు దంపతులు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఎల్లుండి ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రికల్ బస్సులు, నందనం యాప్, భక్తులకు ఎల్‌ఐసీ పథకం, ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy