Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం

తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం

తిరుమల, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): తిరుమలేశుడిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈరోజు (మంగళవారం) ఉదయం దర్శించుకున్నారు.

సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి వేంకటేశ్వరస్వామికి లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న (సోమవారం) రాత్రి తిరుమల చేరుకున్న షణ్ముగంకు మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు.

అనంతరం ఇవాళ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగాన్ని శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. నేడు మధ్యాహ్నం తిరుపతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కేరళంకు మంత్రి లోకేశ్ వెళ్లనున్నారు.

అలాగే, వైకుంఠనాథుడిని మాజీ టీటీడీ ఈవో సాంబశివరావు, మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నటుడు నవీన్ చంద్ర, దర్శకుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy