Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌ భూసేకరణకు గెజిట్‌

తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌ భూసేకరణకు గెజిట్‌

న్యూఢిల్లీ: తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనుల్లో కీలక ముందడుగు పడింది. తిరుపతి-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర రెండో రైల్వే లైన్‌ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలో ఏపీలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలు, తమిళనాడులోని వేలూరు జిల్లా ఉన్నాయి.

 చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని వావిల్‌తోట, పూతలపట్టు తదితర గ్రామాలతో పాటు చిత్తూరు అర్బన్‌ పరిధిలోని ఎల్‌బీ పురం, గండ్లపల్లి, తిమ్మసముద్రం, మురకంబట్టు తదితర ప్రాంతాల్లోని భూములను రైల్వేశాఖ సేకరించనుంది. భూయజమానులు ఈ భూసేకరణపై అభ్యంతరాలను 30 రోజుల్లోగా చిత్తూరు ఆర్‌డీవోకు రాతపూర్వకంగా ఇవ్వాలని రైల్వేశాఖ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy