Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు

టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు

తిరుపతి, సెప్టెంబర్ 2: తిరుపతిలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈరోజు(బుధవారం) ఉదయం పెదకాపు వీధిలోని లోకనాథం నివాసంతోపాటు సమీపంలో ఉన్న ఆయన పెద్ద బావమరిది, చిన్న బావమరిది ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. ​చెల్లూరు గ్రామంలో లోకనాథం బంధువు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ​తిరుమలలోని 'బి టైప్ 53' నంబరు గల గెస్ట్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు.

ఎస్టీవీ నగర్ (STV Nagar) బ్రాంచ్‌లోని ఎస్‌బీఐ(SBI) బ్యాంక్‌లో లోకనాథంకు లాకర్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం లోకనాథం టీటీడీ డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. అలాగే తిరుమల ఆలయానికి సంబంధించిన కీలక బాధ్యతలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఈనెలలోనే తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో టీటీడీ డిప్యూటీ ఈవోగా లోకనాథంకు కీలక బాధ్యతలు ఉంటాయి. ఈ క్రమంలో ఈరోజు ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో టీటీడీ అధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసిన పరిస్థితి లేదు. ఇదే మొట్టమొదటిసారి. ఇలాంటి విషయాల్లో శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే తప్ప.. టీటీడీ ఉద్యోగుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో తోటి ఉద్యోగుల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy