Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు

తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలో సైడ్‌వేస్‌ నుంచి సానుకూల ధోరణిలో సాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల జోరు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) నిధుల రాక మార్కెట్‌కు మద్దతు ఇవ్వనున్నాయి.

అయితే గ్లోబల్‌ మార్కెట్‌ సంకేతాలు, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షతో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండవచ్చు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆటో రంగాలు రాణించే అవకాశం ఉంది. మరోవైపు ఐటీ, ఫార్మా రంగాల్లో లాభాల స్వీకరణ జరగొచ్చు.

స్టాక్‌ రికమండేషన్స్‌

సీపీ ప్లస్‌ (ఆదిత్య ఇన్ఫోటెక్‌): గతేడాది ఆగస్టులో లిస్టయిన ఈ షేర్లు ఇప్పటివరకు 200 శాతం మేర రాబడిని అందించాయి. గరిష్ఠ స్థాయి తర్వాత కాస్త దిద్దుబాటుకు లోనయ్యాయి. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తున్నాయి. గత శుక్రవారం రూ.3,391 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.3,800 టార్గెట్‌ ధరతో రూ.3,360పైస్థాయిలో ప్రవేశించాలి. రూ.3,320 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి.

అపోలో మైక్రోసిస్టమ్స్‌: ఏప్రిల్‌ నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేర్లు బ్రేకౌట్‌ తర్వాత మళ్లీ కాస్త దిద్దుబాటుకు లోనయ్యాయి. త్వరలో ఫలితాలు రానుండటం, గత నిరోధ స్థాయి వద్ద మద్దతు లభించే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గత శుక్రవారం రూ.389 వద్ద ముగిసిన ఈ షేర్లను ఇన్వెస్టర్లు రూ.460 టార్గెట్‌ ధరతో రూ.380పైస్థాయిలో కొనుగోలు చేయాలి. రూ.360 వద్ద స్టాప్‌లాస్‌ ఎంచుకోవాలి.

సీజీ పవర్‌: ఫిబ్రవరి-జూలై మధ్య 80ు రాబడి అందించిన ఈ షేర్లు ఈమధ్య కాస్త దిద్దుబాటుకు లోనయ్యాయి. మరోసారి గత నిరోధ స్థాయి వద్ద మద్దతు తీసుకున్నాయి. రిలేటివ్‌ స్ర్టెంత్‌, వాల్యూమ్‌ పర్వాలేదు. గత శుక్రవారం రూ.863 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో రూ.940 టార్గెట్‌ ధరతో రూ.850పైస్థాయిలో ఎంటర్‌ అవ్వాలి. రూ.830 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

ఎస్కార్ట్స్‌ కుబోటా: 2024 నుంచి 38 శాతం మేర పతనమైన ఈ షేర్లు మరోసారి కీలకమైన రూ.2,700 స్థాయిలో మద్దతు తీసుకున్నాయి. ఫలితాలు విడుదల కానుండటం, వాల్యూమ్‌, రిలేటివ్‌ స్ర్టెంత్‌ పెరుగుతుండటం గమనార్హం. గత శుక్రవారం 2.4 శాతం లాభంతో రూ.3,086 వద్ద ముగిసిన కౌంటర్లో రూ.3,350 టార్గెట్‌ ధరతో రూ.3,050పైస్థాయిలో పొజిషన్‌ తీసుకోవాలి. రూ.3,020 వద్ద స్టాప్‌లాస్‌ ఉంచుకోవాలి.

పాలీక్యాబ్‌: సుదీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేర్లు జీవితకాల గరిష్ఠం తర్వాత 12 శాతం మేర దిద్దుబాటుకు లోనయ్యాయి. మెరుగైన ఫలితాలు విడుదల చేయడం, తక్కువ వాల్యూమ్‌ నమోదవుతుండటం, ధర స్థిరంగా కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గత శుక్రవారం రూ.9,106 వద్ద ముగిసిన ఈ షేర్లను మదుపరులు రూ.9,350 టార్గెట్‌ ధరతో రూ.9,050 వద్ద కొనుగోలు చేయాలి. రూ.9,000 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy