Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలి భేటీకి గుర్తుగా.. పుతిన్‌కు బైడెన్ విలువైన బహుమతి!

తొలి భేటీకి గుర్తుగా.. పుతిన్‌కు బైడెన్ విలువైన బహుమతి!

జెనీవా: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి గుర్తుగా పుతిన్‌కు బైడెన్ ఓ విలువైన బహుమతి ఇచ్చారు. రాండోల్ఫ్ ఇంజనీరింగ్ రూపొందించిన ప్రత్యేకమైన సన్‌గ్లాసెస్‌ను పుతిన్‌కు బహుకరించారు బైడెన్. ఈ సన్‌గ్లాసెస్‌ సంస్థ "కాంకోర్డ్ స్టైల్" ఏవియేటర్స్. 23 క్యారెట్ల బంగారు పూతతో 57 మిల్లీమీటర్ల అమెరికన్ గ్రే రంగు లెన్సులతో తయారుచేయబడ్డాయి. అలాగే కుడి లెన్సుపై బైడెన్ సంతకం కూడా ఉంటుంది. ఇక బైడెన్‌-పుతిన్ మధ్య జరిగిన ఈ తొలి భేటీ సుమారు రెండున్నర గంటల పాటు సాగినట్లు సమాచారం.

ఈ సందర్భంగా డ్రాగన్ దేశం చైనాతో జాగ్రత్తగా ఉండాలని పుతిన్‌కు బైడెన్ సూచించారని తెలుస్తోంది.

అలాగే రష్యాతో సన్నిహిత సంబంధాలకు అగ్రరాజ్యం సిద్ధంగా ఉందని చెప్పిన బైడెన్ ఇక ముందు కూడా ఈ చర్చలను కొనసాగిస్తామని అన్నారు. అటు రష్యా అధ్యక్షుడు సైతం ఈ చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని చెప్పిన పుతిన్‌.. బైడెన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తెలివైన వారని, చాలా అనుభవం గలవారని, అన్ని విషయాలపై మంచి పరిజ్ఞానం ఉందన్నారు. అంతేగాక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ శైలి పూర్తి భిన్నంగా ఉందని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy