Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలి రోజు 91.37 శాతం పింఛన్ల పంపిణీ

తొలి రోజు 91.37 శాతం పింఛన్ల పంపిణీ

పాడేరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి రోజు మంగళవారం 91.37 శాతం లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లను అందించారు. జిల్లాలోని 11 మండలాల్లో 73 వేల 79 మంది ఎన్‌టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు రూ.30 కోట్ల 96 లక్షల 46 వేల 500 సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది.

దీంతో తొలి రోజు మంగళవారం సాయంత్రానికి 66 వేల 770 మంది లబ్ధిదారులకు రూ.28 కోట్ల 20 లక్షల 500 సొమ్మును పంపిణీ చేశారు. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 91.37 శాతంగా నమోదైంది. అలాగే వివిధ కారణాలతో తొలి రోజు పెన్షన్‌ పొందని 6,309 మంది లబ్ధిదారులకు బుధవారం పెన్షన్‌ సొమ్మును అందిస్తామని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

అర్హులందరికీ పింఛన్లు

జిల్లాలో అర్హులైన అందరికీ ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్లను అందిస్తామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. పట్టణంలోని మోదమాంబ కాలనీలో మంగళవారం పలువురు లబ్ధిదారులకు ఆమె పెన్షన్‌ సొమ్మును అందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.జయకృష్ణ, ఎంపీడీవో రతన్‌తేజ, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, వెలుగు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy